Sankranthi 2026 : తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరుస్తున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు

Updated on: Jan 11, 2026 | 6:38 PM

సంక్రాంతి పండుగ 2026 సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. హైదరాబాద్ MGBS, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, విజయవాడ నెహ్రూ, వైజాగ్ ద్వారకా బస్ స్టాండ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. పండుగకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు జనం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

సంక్రాంతి పండుగ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని రవాణా కేంద్రాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో నిండిపోయాయి. పండుగకు ఎలాగైనా సొంత ఊళ్లకు చేరుకోవాలనే దృఢ సంకల్పంతో ప్రజలు చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టాండ్ (MGBS) కిక్కిరిసిపోగా, బస్సులు వచ్చిన వెంటనే నిండిపోతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రైలు ఎక్కేందుకు ప్రయాణికులు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఇదే రద్దీ దృశ్యాలు విజయవాడ నెహ్రూ బస్ స్టాండ్, వైజాగ్ ద్వారకా బస్ స్టాండ్లలోనూ కనిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

East Godavari : 2 లక్షల 50 వేల భోగిపిడకలు సిద్ధం చేసిన అక్కాచెల్లెళ్లు

మరణశిక్షే !! ఇరాన్‌ బెదిరింపు ఆగని నిరసనలు

Neha Shetty: సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న నేహా శెట్టి

మార్చి 19న ధురంధర్ Vs టాక్సిక్

సడన్‌గా తీరిన హీరోయిన్ల కొరత.. కుర్ర హీరోలకు పండగే

Published on: Jan 11, 2026 06:36 PM