ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా

Updated on: Oct 13, 2025 | 3:04 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు చర్యలు చేపట్టారు. నకిలీ వేబిల్లులతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇసుక మాఫియా బాగోతం వెలుగుచూసింది. క్వారీ నిర్వాహకుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నా, పూర్తిస్థాయి విచారణ లోపించడంతో స్థానికులు కలెక్టర్‌ను లోతైన దర్యాప్తునకు కోరుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. నకిలీ వేబిల్లులతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న కొందరి బాగోతం బట్టబయలైంది. ఈ వ్యవహారంలో ఇసుక ర్యాంపు నిర్వాహకుల పాత్ర ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నాలుగు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామానుజవరం ఇసుక క్వారీ నుంచి నకిలీ వేబిల్లులతో హైదరాబాద్‌కు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ లారీని అశ్వాపురం పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌తో సహా ముగ్గురిపై కేసు నమోదు చేసి, లారీని సీజ్ చేశారు. వేబిల్లులను పరిశీలించగా అవి నకిలీవిగా తేలడంతో ఇసుక అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒంగోలు పేస్‌ కాలేజీ సమీపంలో రోడ్డుప్రమాదం

Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు బీజేపీ ఆగ్రహం

రుషికొండపై ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం

ప్రధాని మోదీకి ఆలస్యంగా ఆహ్వానం.. హాజరుపై సందిగ్ధత

నేడు అమరావతిలో CRDA కార్యాలయం ఘనంగా ప్రారంభం