Sabarimala: శబరిమల బంగారు తాపడం వివాదం.. అసలు నిజం ఇదేనా?
శబరిమల బంగారు తాపడం కేసులో ప్రధాన పూజారి కందరారు రాజీవరులును సిట్ అరెస్ట్ చేసింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో సంబంధాలు, చోరీ గురించి ముందే తెలిసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసి, 15 మంది నిందితులను త్వరలో విచారించనుంది.
శబరిమల ఆలయ బంగారు తాపడం కేసులో ప్రధాన పూజారి కందరారు రాజీవరులును సిట్ అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కేరళ సిట్ బృందం శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి రాజీవరులు పూర్తిగా సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. ఉన్నికృష్ణన్ పొట్టిని శబరిమలకు తీసుకువచ్చింది కూడా కందరారు రాజీవరేనని ఇతర నిందితులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. బంగారు తాపడాల దొంగతనం గురించి ఆయనకు ముందే తెలుసని అధికారులు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్
