సైక్లింగ్ మంచిదా.. రన్నింగ్ మంచిదా.. విస్తు పోయే నిజాలు

Updated on: Jul 06, 2025 | 3:18 PM

ఫిట్​‌గా, యాక్టివ్‌గా ఉండేందుకు చాలా మంది జిమ్‌లకు వెళ్తుంటారు. కొందరు ఇంట్లోనే యోగా, సైక్లింగ్ వంటివి చేస్తుంటే.. మరికొందరు రన్నింగ్ మంచిదంటూ పరుగులు పడుతుంటారు. అయితే, సైక్లింగ్ లేదా రన్నింగ్​ఏది బెటర్ అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి.సైక్లింగ్‌, రన్నింగ్‌ వంటి కార్డియో వ్యాయామాలు.. అదనపు కేలరీలను తగ్గించటంతో బాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

అయితే, సైక్లింగ్, రన్నింగ్‌ మధ్య చాలా తేడా ఉందని, సైక్లింగ్‌తో పోలిస్తే రన్నింగ్‌తోనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణులు చేసిన ఓ పరిశోధనలోవెల్లడైంది. తమ పరిశోధనలో భాగంగా, 70 కేజీల బరువున్న మనిషి 30 నిమిషాల పాటు.. గంటకు 5 మీటర్ల వేగంతో రన్నింగ్ చేస్తే 288 కేలరీలు తగ్గుతాయని తేలింది. అదే సైక్లింగ్ చేస్తే 30 నిమిషాలలో 19.3 నుంచి 22.3 మీటర్ల వేగంతో సైక్లింగ్ చేయాలట. వేగం పెంచే కొద్ది శరీరంలోని కేలరీలను ఖర్చు చేయవచ్చని, శరీర కండరాలను బలోపేతం చేసేందుకు రన్నింగ్ చాలా బాగా ఉపయోగపడుతుందని వారి నిర్ధారించారు. వాస్తవానికి రన్నింగ్ కంటే సైకిల్​ తొక్కడం వల్ల కండరాల సామర్థ్యం పెరుగుతుందని, కానీ, దానికి ఎక్కువ సమయం పడుతుందని వారు తెలిపారు. సైక్లింగ్‌ వల్ల తక్కువ కేలరీలు మాత్రమే బర్న్ చేయగలమని, పైగా మోకాలి నొప్పి ఉంటే సైక్లింగ్ చేయటం మంచిది కాదని వారు తెలిపారు. తమ లెక్క ప్రకారం. వారానికి 3 రోజులు సైక్లింగ్, 2 రోజులు రన్నింగ్ చేయటం వల్ల రెండింటి ప్రయోజనాలు పొందొచ్చని ఈ పరిశోధకులు చెబుతున్నారు. ఇక.. గుండె ఆరోగ్యం విషయంలో ఈ రెండూ మంచివేనని వీరు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రియురాలి కరివేపాకు కోరిక తీర్చేందుకు.. దేశాలు దాటి వచ్చిన ప్రియుడు..!

ఫ్రిజ్‌‌లో వింత సౌండ్స్.. వెళ్లి చూడగా గుండె గుభేల్‌

ఫ్యాటీ లివర్‌ సమస్య ఉందా? అయితే, ఈ పది రకాల ఆహార పదార్థాలు మీ కోసమే

గర్భస్రావం తర్వాత జుట్టు రాలుతోందా ?? తగ్గించాలంటే ??

మన నిద్రను శాసించేది ఇవే.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు