Watch Video: భాగ్యనగరంలో కుంగుతున్న రోడ్లు.. నిజాం కాలంనాటి సొరంగాలని ప్రచారం..

| Edited By: Srikar T

Jun 10, 2024 | 7:01 AM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇటీవల రోడ్లు కుంగుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. భారీ వర్షాలతో వరద ప్రవాహం కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా కొట్టుకుపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డు మధ్యలో కుంగడం, పెద్ద పెద్ద గొయ్యిలు పడడం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. హైదరాబాద్‌ పాతబస్తీలో రోడ్డు మధ్యలో పురాతన బావి బయటపడ్డట్లు తెలుస్తోంది. ఉప్పుగూడలోని శివసాయినగర్‌లో రోడ్డు ఒక్కసారిగా కుంగి పెద్ద గొయ్యి ఏర్పడింది. అయితే.. ఆ గొయ్యిలో పురాతన బావి ఉన్నట్లు గుర్తించారు స్థానికులు.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇటీవల రోడ్లు కుంగుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. భారీ వర్షాలతో వరద ప్రవాహం కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా కొట్టుకుపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డు మధ్యలో కుంగడం, పెద్ద పెద్ద గొయ్యిలు పడడం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. హైదరాబాద్‌ పాతబస్తీలో రోడ్డు మధ్యలో పురాతన బావి బయటపడ్డట్లు తెలుస్తోంది. ఉప్పుగూడలోని శివసాయినగర్‌లో రోడ్డు ఒక్కసారిగా కుంగి పెద్ద గొయ్యి ఏర్పడింది. అయితే.. ఆ గొయ్యిలో పురాతన బావి ఉన్నట్లు గుర్తించారు స్థానికులు. అంతేకాదు.. ఆ పురాతన బావిలో సొరంగాలు ఉన్నాయంటూ పెద్దయెత్తున ప్రచారం జరిగింది. దాంతో.. శివసాయినగర్‌లో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఆ తర్వాత.. గొయ్యిని పూర్తిస్థాయిలో పరిశీలించిన ఉన్నతాధికారులు.. ఎలాంటి పురాతన బావి లేదని.. కేవలం వర్షాకాలం నేపథ్యంలోనే గొయ్యి పడిందని తేల్చారు. వెంటనే.. సహాయక చర్యలు చేపట్టి గొయ్యిని పూడ్చి వేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on