వైరల్ అయ్యేందుకు వెర్రి చేష్టలా? కాంతారా రిలీజ్ తర్వాతి ఘటనలపై నిరసన వీడియో
కాంతారా చాప్టర్ 1 ఘన విజయం సాధించినప్పటికీ, కొందరు అభిమానులు థియేటర్లలో పంజుర్లి వేషధారణలో చేసే హంగామా వివాదాస్పదమైంది. దైవత్వ సన్నివేశాలను వైరల్ కోసం అనుకరించడం తులు సమాజ మనోభావాలను దెబ్బతీసింది. హీరో రిషబ్ శెట్టి, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చర్యలను ఖండించి, పవిత్రతను అవమానించవద్దని కోరాయి.
అక్టోబర్ 2న విడుదలైన కాంతారా చాప్టర్ 1 చిత్రం థియేటర్లలో అద్భుత విజయం సాధించింది. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ చిత్రం విజయంతో పాటు కొన్ని వివాదాలను కూడా తెచ్చిపెట్టింది. సినిమాలో చూపించిన దైవత్వ సన్నివేశాలను కొందరు అభిమానులు థియేటర్లలో, బయట అనుకరిస్తూ హంగామా సృష్టించడం ప్రారంభించారు.తమిళనాడులోని దిండిగల్‌లో ఒక థియేటర్‌లోనూ, బెంగళూరులోని అంజన్ థియేటర్ వెలుపల ఒక యువకుడు కాంతారా వేషధారణలో ఊగిపోయిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పంజుర్లి రూపం తులు ప్రాంతంలో శ్రీశక్తికి ప్రతీకగా పూజించబడే దైవం. రిషబ్ శెట్టి ఈ రూపాన్ని ఆధ్యాత్మిక గంభీరతతో తెరపై ఆవిష్కరించారు. ఇలాంటి పవిత్రమైన రూపాన్ని కేవలం వైరల్ అయ్యేందుకు రీక్రియేట్ చేయడం తులునాడు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది.
మరిన్ని వీడియోల కోసం :
