దారితప్పి జనావాసాల్లోకి చేరిన జంతువులు, గాయాలపాలై కిందపడే పక్షులను చేరదీసి, వాటిని తిరిగి మునుపటిలా తిరిగేలా చికిత్స అందించిన విషయాలు మనకు తెలిసినవే. ఇలాంటి పనులు చేయడం వల్ల మనకు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. ఇలాంటిదే.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీటిలో నుంచి నేలపైకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నారో హెడ్ సాఫ్ట్ షెల్ తాబేలును కొందరు అధికారులు గుర్తించారు. వారు తాబేలును రక్షించి, తిరిగి నీటిలో విడిచిపెట్టారు. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతరించిపోతున్న జీవ జాతులను రక్షించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటివరకు 24,000 వీక్షణలు పొందింది. చాలా మంది నెటిజన్లు ఈ పోస్ట్ ను వివిధ గ్రూపులకూ పోస్ట్ చేశారు. “పరిరక్షణకు మీ సేవ గొప్పది, ప్రశంసనీయమైనది” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
This massive Narrow Headed Shoftshell turtle was timely rescued. Endangered & a massive female. After treatment released successfully by our team in deep water. pic.twitter.com/VM16EdnV9G
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 20, 2022
Also Read
Priyanka Chopra: పుట్టిన మూడు నెలల తర్వాత కూతురుకు నామకరణం చేసిన ప్రియాంక.. ఏం పేరు పెట్టిందంటే..