నేషనల్ క్రష్‌కి చెక్ పెట్టేదెవరు? వీడియో
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో నెంబర్ వన్ నాయికగా రష్మిక మందన దూసుకుపోతున్నారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్నిరకాల సినిమాల్లో నటిస్తూ ఆమె అగ్రస్థానాన్ని ఆక్రమించారు. అయితే, రష్మికకు దీటుగా సత్తా చాటగల మరో నాయిక ఎవరు అనే చర్చ ఆసక్తికరంగా మారింది. రుక్మిణి వసంత్, తృప్తి డిమ్రి, పూజా హెగ్డే వంటి వారు ఈ రేసులో ఉన్నారు.
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో నెంబర్ వన్ హీరోయిన్‌గా రష్మిక మందన దూసుకుపోతున్నారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాల్లో నటిస్తూ, భారీ కమర్షియల్ చిత్రాలతో పాటు ఆసక్తికరమైన కాన్సెప్ట్‌లతో కూడిన చిన్న సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఈ బ్యూటీ ప్రస్తుతం అగ్రస్థానాన్ని ఆక్రమించగా, ఈ రేంజ్‌లో సత్తా చాటగల మరో నాయిక ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఈ రేసులో పలువురు నాయికలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. సౌత్ నుంచి లేటెస్ట్ సెన్సేషన్ రుక్మిణి వసంత్ పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఆమె నటించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ కాంతారా చాప్టర్ 1 నేషనల్ లెవెల్‌లో చర్చనీయాంశమైంది. డ్రాగన్ సినిమాతోనూ ఈ బ్యూటీ ట్రెండింగ్‌లో కనిపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
