Andhra: రైడ్ వచ్చిందిగా అని కస్టమర్‌ను ఎక్కించుకున్నాడు.. తీరా స్మశానానికి చేరుకోగానే
విశాఖలో ర్యాపిడో రైడర్‌ను ఓ వ్యక్తి బెదిరించి డబ్బులు దోచుకున్న ఘటన కలకలం రేపింది. విశాఖలోని శ్రీనగర్ పెట్రోల్ బంక్ దగ్గర రాపిడో బుక్ చేసుకున్న మణికంఠ అనే వ్యక్తి.. కణితి స్మశాన వాటిక సమీపంలోకి రాగానే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
విశాఖలో ర్యాపిడో రైడర్‌ను ఓ వ్యక్తి బెదిరించి డబ్బులు దోచుకున్న ఘటన కలకలం రేపింది. విశాఖలోని శ్రీనగర్ పెట్రోల్ బంక్ దగ్గర రాపిడో బుక్ చేసుకున్న మణికంఠ అనే వ్యక్తి.. కణితి స్మశాన వాటిక సమీపంలోకి రాగానే వాహనాన్ని ఆపి రైడర్‌పై బెదిరింపులకు దిగాడు. రైడర్‌పై దాడి చేసి ఫోన్ పే ద్వారా 48వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి.. ఫోన్ పే నంబర్ ఆధారంగా నిందితుడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..