Weather Update: నిన్నటి వరకు ఎండలు చంపేశాయి.. ఇక వర్షాలు ముంచేస్తాయా..? తెలుగు రాష్ట్రాల్లో అలెర్ట్..

|

Jun 28, 2023 | 8:13 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరిస్తున్నాయి. తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని 8 జిల్లాలకు వాతావరణశాఖ అతి భారీ వర్షసూచన జారీ చేసింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరిస్తున్నాయి. తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని 8 జిల్లాలకు వాతావరణశాఖ అతి భారీ వర్షసూచన జారీ చేసింది. నేడు, రేపు వర్షం కురిసే ప్రాంతాలకు హెచ్చరికలను జారీ చేసింది. రెండు రోజుల క్రితం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్లు పేర్కొంది. నైరుతి రుతుపవనాల రాకతో పలు చోట్ల తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.

ప్రస్తుతానికైతే రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని.. ఇదే వేగాన్ని కొనసాగిస్తే రానున్న మూడురోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆదివారం నాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఆదివారం.. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అత్యధికంగా 8 సెంటిమీటర్లు వర్షం కురిసింది. హైదరాబాద్ లో కుత్బుల్లాపూర్, చింతల్, నిజాంపేట్, బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..