AP Rains: ఏపీకి వర్ష సూచన.! మోస్తరు వర్షాలు 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం.
నవంబరు 21న దక్షిణ అండమాన్‌పై ఏర్పడే ఉపరితల ఆవర్తనం.. 23 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడనుందని.. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
దక్షిణ అండమాన్ సముద్రం – దాని పరిసర ప్రాంతాలు మీదుగా ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళా ఖాతం మీదుగా నవంబర్ 23న అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు రోజులలో మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. ఇటు ఆంధ్ర ప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ – రాయలసీమలో మంగళ,బుధ, గురువారల్లో వాతావరణము పొడిగా ఉండే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. బంగళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం.. పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫానుగా మారనుంది. ఈ నెల 26 లేదా 27నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుంది. దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.