AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోకో పైలట్ మానవత్వం..  మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

Phani CH
|

Updated on: May 08, 2026 | 12:52 PM

Share

రైల్వే ట్రాక్‌లపై ప్రమాదవశాత్తు చిక్కుకున్న మూగజీవుల ప్రాణాలను లోకో పైలట్లు తమ సమయస్ఫూర్తి, మానవత్వంతో ఎలా కాపాడుతున్నారో ఈ కథనం వివరిస్తుంది. రైలును నిలిపి బర్రెను, పది సింహాలను రక్షించిన సంఘటనలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. వారిని నిజమైన హీరోలుగా నెటిజన్లు కీర్తిస్తున్నారు. ఈ చర్యలు లోకో పైలట్ల నిబద్ధతను, జీవకారుణ్యాన్ని చాటుతున్నాయి.

రైల్వే ట్రాక్‌లను దాటుతున్న సమయంలో నిత్యం వందలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. లోకో పైలట్‌లు ఎంతగా ప్రయత్నించినా, రైళ్లను క్షణాల వ్యవధిలో ఆపడం సాధ్యం కాకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ, కొన్నిసార్లు లోకో పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి వాటిని కాపాడుతున్న సందర్భాలూ ఉన్నాయి. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా, లోకో పైలట్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. రైల్వే ట్రాక్‌పైకి ఓ గేదె వచ్చింది. అది గమనించిన లోకో పైలట్ ఎన్నిసార్లు హారన్ కొట్టినా ట్రాక్‌పై ఉన్న గేదె అక్కడి నుంచి కదలలేదు. ముందు జాగ్రత్తగా రైలు వేగాన్ని తగ్గించి రైలును నిలిపివేశాడు లోకో పైలట్. కిందకు దిగి ఆ గేదెను పట్టాల నుంచి పక్కకు పంపించారు. ఇంకా ఏమైనా గెదెలు ఇతర జీవాలు రైలు ట్రాక్‌పై ఉన్నాయా అని పరిక్షించి ఏవీ లేవని నిర్ధారించుకున్న తర్వాత మళ్లీ రైలు ప్రయాణం మొదలుపెట్టారు. లోకో పైలట్ చూపించిన మానవత్వం, మూగజీవుల పట్ల ఆయనకున్న ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు లోకో పైలట్‌ను ‘నిజమైన హీరో అంటే నువ్వే బ్రదర్’ అని పొగిడేస్తున్నారు. గుజరాత్‌లోని గిర్ సింహాల అభయారణ్యంలో గతంలో ఇలాంటి ఘటనే జరిగింది. గూడ్స్ రైలును పిపావావ్ పోర్ట్ స్టేషన్ నుంచి ప్రధాన కారిడార్ పక్కన ఒక చిన్న ట్రాక్ పైకి తీసుకుస్తున్నారు లోకోపైలట్‌. అయితే.. ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న 10 సింహాలను గుర్తించారు. ఒకేసారి 10 సింహాలు ట్రాక్ పై నిద్రించడం చూసి తొలుత భయపడినా ఆ తర్వాత సడన్ బ్రేకులు వేశారు. రైల్వే ట్రాక్పై పడుకున్న సింహాలను చూసి అప్రమత్తతో వ్యవహరించిన ఆయన ట్రైన్ ఆపి వాటి ప్రాణాలను కాపాడారు. సింహాలు లేచి పట్టాలపై నుంచి వెళ్లే వరకు వేచి ఉండి.. ఆ తర్వాత రైలును స్టార్ట్‌ చేశారు. సదరు లోకో పైలట్ ను పలువురు అధికారులు ప్రశంసించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి..

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే..

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

Follow Us