ఆ రోజు అభినందన్‌ను పాక్ విడిచి పెట్టకపోతే ఏం జరిగి ఉండేది ??

|

Jan 10, 2024 | 9:23 PM

2019 ఫిబ్రవరి 27న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాక్‌ బంధించి చిత్రహింసలకు గురి చేసింది. ఆ సమయంలో తీవ్రంగా స్పందించిన భారత్‌ దాయాదిపైకి 9 క్షిపణులతో సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్‌ తీవ్రంగా భయపడిందని భారత మాజీ హై కమిషనర్‌ అజయ్‌ బిసారియా తన పుస్తకంలో బయటపెట్టారు. భారత్‌, పాక్‌ మధ్య దౌత్య సంబంధాలపై ఆయన రాసిన పుస్తకం త్వరలోనే విడుదల కానుంది.

2019 ఫిబ్రవరి 27న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాక్‌ బంధించి చిత్రహింసలకు గురి చేసింది. ఆ సమయంలో తీవ్రంగా స్పందించిన భారత్‌ దాయాదిపైకి 9 క్షిపణులతో సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్‌ తీవ్రంగా భయపడిందని భారత మాజీ హై కమిషనర్‌ అజయ్‌ బిసారియా తన పుస్తకంలో బయటపెట్టారు. భారత్‌, పాక్‌ మధ్య దౌత్య సంబంధాలపై ఆయన రాసిన పుస్తకం త్వరలోనే విడుదల కానుంది. వీటిల్లో కొన్నింటిని ఓ జాతీయ మీడియా సంస్థ తమ కథనంలో వెల్లడించింది. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేశాయి. ఈ క్రమంలోనే నాటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారట. అందుకు మోదీ నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే అనంతరం అభినందన్‌ వర్ధమాన్‌ను విడిపించుకునేందుకు పాక్‌వైపు క్షిపణులు ఎక్కుపెట్టినట్లు భారత్‌ ఎన్నడూ అధికారికంగా వెల్లడించలేదు కానీ, దాని వల్లే అప్పటి ఖాన్‌ ప్రభుత్వం భయపడిందని అజయ్‌ తన పుస్తకంలో వివరించారు. 2019లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. అభినందన్‌ను పాక్‌ విడిచిపెట్టి మంచి పని చేసిందనీ లేదంటే వారు భయంకరమైన రాత్రిని చవిచూడాల్సి వచ్చేది అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్యలో సీతమ్మ కోసం ప్రత్యేక చీర

ఆ ముహూర్తానికే బిడ్డలకు జన్మనివ్వాలి.. యూపీ గర్భిణీల ఆరాటం

పాకిస్తాన్ లో మర్రిచెట్టు అరెస్ట్.. 125 ఏళ్లుగా సంకెళ్లతో బందీగా

ఆ హనుమాన్ ఆలయంలో ఆ ఒక్క రోజు పొంగళ్ల నైవేద్యం వెనుక కథ ఇదే

ఫోన్లు అతిగా వాడొద్దంటూ షరతు !! ఫ్యామిలీతో బాండ్‌ రాయించుకున్న మహిళ !!