Pomegranate Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే.. ఇంక అంతే సంగతులు

Updated on: Jan 20, 2026 | 1:09 PM

దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినా, అందరికీ తగినది కాదు. లో-బీపీ ఉన్నవారు, స్టాటిన్స్, ACE ఇన్హిబిటర్ల వంటి మందులు వాడేవారు, సర్జరీకి సిద్ధమవుతున్నవారు, సున్నితమైన జీర్ణశక్తి ఉన్నవారు, అలాగే దానిమ్మ అలర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఇది రక్తపోటును తగ్గించడం, మందులతో చర్య, రక్తస్రావం పెంచడం, జీర్ణ సమస్యలు కలిగించే ప్రమాదం ఉంది. వైద్యుడి సలహా తప్పనిసరి.

దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఈ పండు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే అందరికీ దానిమ్మ మేలు చేయదు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు దానిమ్మను తింటే అది ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులు మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. యూరోపియన్ PMC, రీసెర్చ్ గేట్ వంటి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల అధ్యయనాల ప్రకారం.. దానిమ్మ పండును ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మలో ఉండే పొటాషియం రక్త నాళాలను సడలించి రక్తపోటును తగ్గిస్తుంది. ఇది హైబీపీ ఉన్నవారికి వరం, కానీ ఇప్పటికే లో-బీపీ ఉన్నవారికి శాపం. రోజుకు 300 ml దానిమ్మ రసం తాగడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. లో బీపీ ఉన్నవారు దీనిని తీసుకుంటే మైకము, కళ్లు తిరగడం, అస్పష్టమైన దృష్టి, స్పృహ తప్పి పడిపోయే ప్రమాదం ఉంది. అలాగే రెగ్యులర్‌గా మందులు వాడేవారు కూడా దానిమ్మకు దూరంగా ఉండటం మంచిది. దానిమ్మలోని సమ్మేళనాలు కాలేయం మందులను ప్రాసెస్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టాటిన్స్, ACE ఇన్హిబిటర్లు యాంటీకోగ్యులెంట్స్ వంటి మందులు వాడుతున్నప్పుడు దానిమ్మ తింటే, మందుల ప్రభావం శరీరంలో ఎక్కువ కాలం ఉండిపోయి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఆపరేషన్ చేయించుకునే వారు సర్జరీకి కనీసం 2 వారాల ముందే దానిమ్మను మానేయాలి. లేకపోతే.. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సర్జరీ సమయంలో అనస్థీషియా మందులు పనిచేయకుండా చేసే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల సర్జరీ టైంలో అధిక రక్తస్రావం కావచ్చు. దానిమ్మలో పుష్కలంగా ఉండే ఫైబర్.. జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. అయితే.. సున్నితమైన జీర్ణ శక్తి ఉన్నవారిలో ఈ ఫైబర్ పేగు పొరను చికాకు పెట్టి.. కడుపు ఉబ్బరం, తిమ్మిరి లేదా విరేచనాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్నవారు దానిమ్మకు దూరంగా ఉండటం మంచిది. దానిమ్మ తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు, దురద, ఆయాసం, ముఖం లేదా గొంతు వాపు కనిపిస్తే.. దానిని అలెర్జీగా అనుమానించి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పారాసిటమాల్ వాడకంపై ఆందోళన వద్దు.. అధ్యయనం ఏం చెప్పిందంటే

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!

మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా

డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా

విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి