YS Sharmila Arrest: పాదయాత్రలో ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల అరెస్ట్.. లైవ్ వీడియో
షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను అడ్డుకున్నారు టీఆర్ఎస్ నాయకులు.
షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను అడ్డుకున్నారు టీఆర్ఎస్ నాయకులు. షర్మిల కేరవాన్‌కు.. టీఆర్ఎస్ నిరసనకారులు నిప్పు పెట్టారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫ్లెక్సీలు టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. గోబ్యాక్ షర్మిల అని నినాదాలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఆదివారం జరిగిన నర్సంపేట సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు గానూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో ఎంపీపీ విజేందర్, సర్పంచ్ కుమార స్వామి, నాయకులు చెన్నారెడ్డి ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అకస్మాత్తుగా మరణించింది గోవు.. కన్నీరు పెట్టిన లేగ దూడ..
మూకుమ్మడిగా వీధి కుక్కల దాడి.. రెప్పపాటులో తప్పించుకున్న చిన్నారి.. షాకింగ్ వీడియో !!
ఫిఫా ప్రపంచకప్ ఫీవర్.. మ్యాచ్ చూసేందుకు ఏకంగా ఓ ఇంటి కొనుగోలు !!
అవతార్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్స్.. ఒక్కో టికెట్ ధర ఎంతంటే ??