Watch Video: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఖండించిన సజ్జల..

|

May 10, 2024 | 1:29 PM

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వస్తున్న అవాస్తవాలను ఖండించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారన్నారు. వీళ్లు అసలు మనుషులేనా అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని అడిగారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వస్తున్న అవాస్తవాలను ఖండించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారన్నారు. వీళ్లు అసలు మనుషులేనా అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని అడిగారు. ఈ సందర్భంగా గతం అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన కామెంట్స్ ను ప్రెజెంట్ చేసి చూపించారు. 2019 జూలై 29న ఈ బిల్లుకు టీడీపీ మద్దతు ప్రకటించిందన్నారు. అప్పటి అసెంబ్లీలో ఆమోదించి ఇప్పుడు వ్యతిరేకిస్తూ అడ్డంగా దొరికిపోయిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని మోదీ, అమిత్ షాలతో ఎందుకు చెప్పించలేదన్నారు. ఈ స్టాంపింగ్ విధానం చంద్రబాబు హయాంలో మొదలైందని వివరించారు. చంద్రబాబు హయాంలో తెల్గీ స్టాంపుల కుంభకోణం తర్వాతే స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఇ-స్టాంపింగ్ పత్రాలు జిరాక్స్ కాపీలే అయితే చంద్రబాబు చించేయాలని కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..