ఆడబిడ్డలపై అఘాయిత్యం చేస్తే.. వారికి అదే చివరిరోజు కావాలి

Updated on: Oct 21, 2025 | 9:00 PM

సీఎం చంద్రబాబు ఏపీ పోలీస్ వ్యవస్థను ఆదర్శంగా అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వల్లే విశాఖకు 15 బిలియన్ డాలర్ల గూగుల్ పెట్టుబడులు వచ్చాయన్నారు. మంగళగిరి పోలీస్ సంస్మరణ సభలో మాట్లాడుతూ, ఆడబిడ్డలపై అఘాయిత్యం చేస్తే వారికి అదే చివరిరోజు కావాలని తీవ్రంగా హెచ్చరించారు. ప్రజల భద్రతకు పోలీస్ వ్యవస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మంగళగిరిలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీ పోలీస్ వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండటం వల్లే 15 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన గూగుల్ పెట్టుబడులు విశాఖపట్నంకు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్, అభివృద్ధి పట్ల పెట్టుబడిదారులకున్న నమ్మకాన్ని తెలియజేస్తాయని సీఎం అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శబరిమల మార్గంలో విరిగిపడ్డ కొండ చరియలు

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ బహిరంగ లేఖ

తోకలపూడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో చిల్లర దొంగ చేతివాటం

దీపకాంతుల్లో అయోధ్య.. రెండు గిన్నిస్ రికార్డులు

ల్యాండ్ అవుతూ.. కుప్పకూలిన విమానం