WITT: వికసిత్‌ భారత్‌లో నారీశక్తి కీలకం.. టీవీ9 సమ్మిట్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు

|

Feb 26, 2024 | 3:07 PM

ప్రధాని మోదీ హయాంలో మహిళలు అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారని అన్నారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. ఢిల్లీలో టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొని మాట్లాడిన స్మృతి ఇరానీ.. భారత స్వాతంత్య్ర పోరాటంలో మహిళా శక్తి కూడా కీలక పాత్ర పోషించిందని అన్నారు. రాణి లక్ష్మీబాయి ఉదాహరణను ఇస్తూ, ఆమె తన కొడుకును వీపుపై కట్టుకుని బ్రిటిష్ వారిపై సాహసోపేతంగా పోరాడారని గుర్తుచేశారు. లింగ సమానత్వంపై మాట్లాడుతూ..

ప్రధాని మోదీ హయాంలో మహిళలు అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారని అన్నారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. ఢిల్లీలో టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొని మాట్లాడిన స్మృతి ఇరానీ.. భారత స్వాతంత్య్ర పోరాటంలో మహిళా శక్తి కూడా కీలక పాత్ర పోషించిందని అన్నారు. రాణి లక్ష్మీబాయి ఉదాహరణను ఇస్తూ, ఆమె తన కొడుకును వీపుపై కట్టుకుని బ్రిటిష్ వారిపై సాహసోపేతంగా పోరాడారని గుర్తుచేశారు. లింగ సమానత్వంపై మాట్లాడుతూ.. పిల్లలు పుట్టే సమయంవికసిత్‌ భారత్‌లో నారీశక్తి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందన్నారు స్మృతి ఇరానీ. మహిళలకు 6 మాసాల ప్రసూతి సెలవులు, మహిళా రిజర్వేషన్లు వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. ప్రధాని మోదీ పాలనలో మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధిలో పురుషులకు సమానమైన పాత్రను మహిళలు కూడా పోషిస్తున్నారని చెప్పారు.

Published on: Feb 26, 2024 03:06 PM