Viral Video: గ్రామ పెద్దల నిర్వాకం.. కుటుంబం వెలివేత! వీడియో

|

Sep 28, 2021 | 10:23 PM

శాస్త్రీయంగా ఎంతో అభివృద్ధి చెందినా .. అక్కడక్కడా అనాగరిక పద్దతులు, ఒంటెద్దు పోకడలు, గ్రామ పెద్దల దాష్టీకాలు బయటపడతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శాస్త్రీయంగా ఎంతో అభివృద్ధి చెందినా .. అక్కడక్కడా అనాగరిక పద్దతులు, ఒంటెద్దు పోకడలు, గ్రామ పెద్దల దాష్టీకాలు బయటపడతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని.. కుటుంబాన్ని వెలి వేశారు గ్రామపెద్దలు. కుల సంఘం చెప్పినా వాళ్లకు సపోర్ట్ చేయలేదని గ్రామం నుండి బహిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా అకివీడు మండలం చినమిల్లిపాడులో ఈ వెలి ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. చినమిల్లిపాడు గ్రామంలో గడిచిన పంచాయతీ ఎన్నికల్లో బల్లే నాగేశ్వరరావు కుటుంబంకు మద్దతు ఇవ్వలేదని..నాగేశ్వరరావు కుటుంబాన్ని వెలి వేశారు కుల పెద్దలు. తమ కులానికి చెందిన సర్పంచ్‌కు కాకుండా.. వేరే వర్గానికి చెందిన వ్యక్తికి పని చేశారనే కక్ష్యతో తమను వెలివేసారన్నారు బాధిత కుటుంబసభ్యులు. దీంతో తమ బంధువులు సైతం తమ ఇంటి వైపు చూటడం లేదని, శుభకార్యాలకు కూడా పిలవడం లేదని ఆవేదన చెందుతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video : జారుడు బల్ల ఆడిన ఎలుగుబండి.. నెట్టింట వీడియో వైరల్

ధావన్‌ ఎమోషనల్‌ ట్వీట్‌.. అవును.. నిజమే అంటున్న భజ్జీ.! వీడియో