Weekend Hour: ఢిల్లీ ఈడీ డైరీలో కొత్తకోణాలేంటి..? కవిత అరెస్ట్ తప్పదా..?

|

Mar 11, 2023 | 7:05 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఏదుర్కొంటున్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితను 8గంటలుగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. ప్రస్తుతం ఢిల్లీలో ఈడీ కార్యాలయం దగర హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఏదుర్కొంటున్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితను 8గంటలుగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. ప్రస్తుతం ఢిల్లీలో ఈడీ కార్యాలయం దగర హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు సహా ప్రముఖులు అక్కడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉండి ఎప్పటికప్పుడు మంత్రులతో మాట్లాడుతూ పరిస్థితి అంచనా వేస్తున్నారు. అటు ఈడీ కార్యాలయంలో కవితను విచారిస్తుండగానే ఇటీవల తెలంగాణలో బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కవితను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ కేడర్‌ భగ్గుమంటోంది. బండి సంజయ్‌ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు కార్యకర్తలు. అటు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడానికి మేయర్‌ సహా ఎమ్మెల్యేలు వెళ్లినా అనుమతి లేదంటూ పోలీసులు తిప్పిపంపారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ యాసలో మాట్లాడితే కూడా విమర్శలు చేస్తారా అంటూ బీజేపీ స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 11, 2023 07:05 PM