Revanth Reddy: కలుపు మొక్కలను ఏరిపారేస్తున్నాం.. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం..

|

Mar 17, 2024 | 2:15 PM

ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం.. కేసీఆర్ నాటిన కలుపు మొక్కలను ఏరిపారేస్తున్నాం.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మీట్ ద ప్రెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమ వంద రోజుల పాలనలో ఎలాంటి పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం.. కేసీఆర్ నాటిన కలుపు మొక్కలను ఏరిపారేస్తున్నాం.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మీట్ ద ప్రెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమ వంద రోజుల పాలనలో ఎలాంటి పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎన్నికల నగారా మోగడంతో తన రాజకీయ రూపం చూపిస్తానని అన్నారు. తాను కేంద్రం, గవర్నర్ ఇతర రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలతో ఘర్షణ వాతావరణం కోరుకోవడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. తమ పాలనతో ఈ విషయాన్ని స్పష్టం చేశామన్నారు. ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ నాటిన కలుపుమొక్కలను ఏరిపారేస్తామన్నారు.. 5 ఎకరాలలోపు ఉన్న వారికి రైతు భరోసా ఇచ్చామని దానిని నెరవేరుస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ రూపం చూపిస్తానంటూ రేవంత్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..