Weekend Hour: రాజధాని రాజకీయం.. ఉత్తరాంధ్రకు రూ. 50వేల కోట్ల ప్యాకేజీ కావాలి.. (లైవ్).

|

Jan 07, 2023 | 7:01 PM

విశాఖలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక సదస్సు.ఉత్తరాంధ్రకు రూ. 50వేల కోట్ల ప్యాకేజీ కావాలి..ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటుకై డిమాండ్.లోక్ సత్తా జేపీకి ఎదురైన నిరసన సెగ.ఈ కార్యక్రమంపై స్పందించిన మంత్రి అమర్నాథ్


విశాఖలోని ఒక ప్రైవేటు హోటల్ లో ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అనే అంశంపై ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ చర్చా వేదికకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కన్వీనర్ గా వ్యవహరించారు. ఈ సదస్సుకు అధికార పార్టీ తప్ప అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. లోక్ సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ, టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్న పాత్రుడు, పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, సీపీఐ, సీపీఎం కార్యదర్శులు రామకృష్ణ, శ్రీనివాసరావు హాజరయ్యారు.విశాఖకు పాలనా రాజధానికన్నా ముఖ్యంగా.. అభివృద్ధి జరగాలని. అందుకంటూ ఒక డిక్లరేషన్ తయారు చేసి దానిపై ఉద్యమిస్తామని ప్రకటించిందీ చర్చా వేదిక. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, ఆరోగ్యం, విద్యపై విస్తృతంగా చర్చ జరగాలని అభిప్రాయ పడిందీ చర్చా వేదిక.చర్చా వేదిక కన్వీనర్ కొణతాల మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి 50వేల కోట్ల రూపాయల ప్యాకేజీ విడుదల చేయాలని కోరారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కారణంగా 8 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని. రాష్ట్ర బడ్జెట్ లో 15 నుంచి 20 శాతం నిధులను ఉత్తరాంధ్ర, రాయలసీమకు కేటాయించాలని డిమాండ్ చేశారాయన.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.