Watch: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టుకు సీపీఐ నారాయణ వినతి

|

Sep 20, 2024 | 1:45 PM

గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో జంతువుల నూనె వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారంరేపుతున్నాయి. దీనికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్‌ను కూడా టీడీపీ వర్గాలు మీడియాకు రిలీజ్ చేశాయి. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సుమోటాగా విచారణ చేపట్టాలని..

గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో జంతువుల నూనె వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారంరేపుతున్నాయి. దీనికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్‌ను కూడా టీడీపీ వర్గాలు మీడియాకు రిలీజ్ చేశాయి. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సుమోటాగా విచారణ చేపట్టాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ కోరారు. విచారణలో నిజానిజాలను నిగ్గుతేల్చాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు నిజమే అన్నారు. అసలు, ఊరూపేరు లేని కంపెనీలకు తిరుమలకు సంబంధించి నెయ్యి టెండర్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.