Munugode Results: పదో రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం.. కొనసాగుతున్న గులాబీ పార్టీ జోరు..

| Edited By: Ravi Kiran

Nov 06, 2022 | 2:45 PM

మొత్తానికి, మునుగోడు కౌంటింగ్ పై రాజకీయ రచ్చ జరుగుతోంది. కౌంటింగ్ ఆలస్యంపై BJP, TRS విమర్శలు గుప్పిస్తుండటంతో వ్యవహారం హీటెక్కింది. ఫలితాల జాప్యం పై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు.ఈసీ అప్రూవ్ తర్వాతే ఫలితాలు విడుదల చేస్తున్నామన్నారు. ఫలితాల విడుదలలో ఎటువంటి జాప్యం లేదన్నారు.

మునుగోడు కౌంటింగ్ తీరుపై BJP సీరియస్ అయ్యింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు ఫోన్‌ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి … రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఫలితాలు వెల్లడించకపోవడంపై ఆరా తీశారు. కిషన్‌రెడ్డి ఫోన్ చేసిన 10నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలు అప్‌డేట్‌ అయ్యాయి.
దీంతో ఈసీ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫలితాల వెల్లడి అనుమానాస్పదంగా ఉందన్నారు బండి సంజయ్. TRSకు లీడ్ వస్తే తప్ప ఫలితాలు అప్‌డేట్ చేయరా? అంటూ ఈసీపై విరుచుకుపడ్డారు. మరోవైపు, మునుగోడులో ధర్మమే విజయం సాధిస్తుందన్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
టీఆర్‌ఎస్‌ సైతం ఈసీ తీరును తప్పుబట్టింది. కౌంటింగ్‌ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని డిమాండ్ చేసింది.కౌంటింగ్ కేంద్రం నుంచి లీకులు ఎలా వస్తున్నాయో చెప్పాలన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. ప్రతిరౌండ్ పూర్తైన వెంటనే ఫలితాల వివరాలు ఇవ్వాలన్నారు.

Published on: Nov 06, 2022 06:39 AM