Watch Video: త్వరలో కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు.. కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. మునుకోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతున్నారు. తాజాగా మాజీ ఎంపీ వివేక్ వెంటకస్వామి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్థంపుచ్చుకోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. మునుకోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే తాజాగా మాజీ ఎంపీ వివేక్ వెంటకస్వామి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్థంపుచ్చుకోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై టీవీ9తో మాట్లాడిన కోమటిరెడ్డి.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడమే తమ లక్ష్యం అన్నారు. బీజేపీ-బీఆర్‌ఎస్ ఒక్కటేనని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

