Telangana CM: ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం..! ఇంతకీ హైకమాండ్‌ మాటేమిటి? సీఎం ఎవరు..

|

Dec 04, 2023 | 6:53 PM

తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా రెండో శాసనసభను రద్దు చేసి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూలంగా ఎన్నికల సంఘం నివేదికతో గెజిట్‌ కూడా విడుదల అయింది. ఉదయం నుంచి దర్భార్‌ హాల్‌లో ప్రమాణస్వీకారం కోసం కావాల్సిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు.

తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా రెండో శాసనసభను రద్దు చేసి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూలంగా ఎన్నికల సంఘం నివేదికతో గెజిట్‌ కూడా విడుదల అయింది. ఉదయం నుంచి దర్భార్‌ హాల్‌లో ప్రమాణస్వీకారం కోసం కావాల్సిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఇక ప్రకటన వస్తుందని అనుకుంటున్న సమయంలో సీను మారింది. ఎమ్మెల్యే అభ్యర్ధుల సిఎల్పీ నేత ఎంపిక నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగించారు ఎమ్మెల్యేలు. సిఎల్పీ సమావేశంలో సభ్యుల అభిప్రాయాలు సేకరించిన ఏఐసీసీ పరిశీలకులు విషయాన్ని ఢిల్లీ పెద్దలకు పంపారు.

అటు కొత్త సీఎం కాన్వాయ్‌ రెడీ చేశారు. మంత్రివర్గానికి అవసరమైన వాహనాలు కూడా సిద్ధం చేశారు. కానీ కాంగ్రెస్‌ మార్క్ రాజకీయంతో సీఎం ఎవరు అనేది నిర్ణయం జరగడం లేదు. తెలంగాణలో సీనియర్ల మధ్య పోటీ ఉండటంతో పార్టీ అధిష్టానం మరోసారి సంప్రదింపుల ద్వారానే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..