Telangana Assembly: ఈనెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Updated on: Aug 26, 2025 | 1:11 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల(ఆగష్టు) 30 నుండి ఐదు రోజుల పాటు జరగనున్నాయి. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ సమర్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై ప్రధానాంశంగా చర్చించనున్నారు.  ప్రభుత్వం ఇప్పటికే నివేదికను సమీక్షించి క్యాబినెట్‌లో చర్చించింది. అసెంబ్లీలో నివేదికపై వివరణాత్మక చర్చ జరుగుతుందని భావిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగష్టు 30వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల ప్రధాన అంశం జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలోని కమిషన్ సమర్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇటీవలే ఈ నివేదికను ప్రభుత్వం పరిశీలించింది. క్యాబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చ జరిగింది. ఇప్పుడు అసెంబ్లీలో ఈ నివేదికపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నివేదికను ప్రజల ముందు, అసెంబ్లీ ముందు పెట్టాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ముఖ్యమైనవి. క్యాబినెట్ సమావేశంలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌ న్యూస్‌.. త్వరలో భారత్‌లో ఓపెన్‌ ఏఐ తొలి ఆఫీస్‌

విమానంలో భార్యాభర్తల కొట్లాట.. దెబ్బకు షాక్!

వ్యతిరేక దిశలో ప్రవహించే నదిని చూసారా?

అబ్బాయిలూ భద్రం..! ప్రియుడిని అమ్మేసిన కిలేడీ

అదృష్టం అంటే నీదే బ్రో.. కేవలం రూ. 30 పెట్టుబడితో.. రూ. కోటి సంపాదన

Published on: Aug 26, 2025 01:09 PM