Harish Rao: ‘ఉద్యమ సూర్యుడా, వీరుడా’.. హరీష్ రావుపై పాటతో అభిమానం చాటుకున్న రాహుల్ సిప్లిగంజ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తేదీ దగ్గరపడుతోంది. దీంతో పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇక ఈసారి ఎన్నికల ప్రచారంలో పాటలు దుమ్మురేపుతున్నాయి. అన్ని పార్టీలకు చెందిన వారు పాటలతో ప్రచారంలో వేగాన్ని పెంచుతున్నారు. ఈ పాటలకు అటు పార్టీ కేడర్‌తో పాటు సామాన్య జనాలకు కూడా ఊపు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా ఓ పాటను...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తేదీ దగ్గరపడుతోంది. దీంతో పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇక ఈసారి ఎన్నికల ప్రచారంలో పాటలు దుమ్మురేపుతున్నాయి. అన్ని పార్టీలకు చెందిన వారు పాటలతో ప్రచారంలో వేగాన్ని పెంచుతున్నారు. ఈ పాటలకు అటు పార్టీ కేడర్‌తో పాటు సామాన్య జనాలకు కూడా ఊపు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా ఓ పాటను రాసి ఆలపించారు. తన అభిమాన నాయకుడు మంత్రి హరీశ్ రావుపై అభిమానంతో ప్రత్యేకంగా పాటను రూపొందించారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలు, పథకాలను వివరిస్తూ ఈ పాటను చిత్రీకరించారు. ఉద్యమం మొదలు అభివృద్ధి వరకు హరీష్ రావు పాత్రను వివరిస్తూ ఈ పాటను రూపొందించారు. ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ సభలో హరీష్ రావు సమక్షంలోనే ఈ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ పాట హల్చల్ చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

