Sajjala: తాడేపల్లిలో సజ్జలకు ఎందుకంత ప్రాధాన్యత.. ఆయన మాటల్లోనే సమాధానం

Sajjala: తాడేపల్లిలో సజ్జలకు ఎందుకంత ప్రాధాన్యత.. ఆయన మాటల్లోనే సమాధానం

Ram Naramaneni

|

Updated on: Mar 25, 2024 | 8:01 PM

తమకు లీడర్ ఒక్కరే.. మిగతాది అంతా టీమ్ వర్క్ అంటున్నారు సజ్జల. టీడీపీ తనను టార్గెట్ చేయడం వల్లే తాను ఎక్స్‌పోజ్ అయ్యానని చెబుతున్నారు. తమ టీమ్ అంతా జగన్ డైరెక్షన్స్ ఫాలో అవుతుందని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారో వీడియో చూద్దాం పదండి...

కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చారు సజ్జల.  సామాన్య జర్నలిస్టుగా ప్రయాణం మొదలుపెట్టి.. వైసీపీలో అత్యంత కీలక వ్యక్తిగా ఎదిగారు. మనిషి సింపుల్.. మాటలు సౌమ్యంగానే ఉంటాయ్… కానీ కలంలో పదునెక్కువ. విదేయతలో ఆయనకు ఆయనే సాటి. అయితే వైసీపీలో మీరే కదా అత్యంత పవర్‌ఫుల్ వ్యక్తి అంటే.. సజ్జలు ఒప్పుకోలేదు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో పాల్గొన్న ఆయనకు..  ఈ ప్రశ్నే సంధించారు సంస్థ మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్. జగన్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేది మీరే కదా అని అడగ్గా. అది అంతా టీమ్ వర్క్ అని చెప్పారు. జర్నలిస్టుగా ఉన్న అనుభవం, రాజకీయాలను నిరంతరం పర్యవేక్షించే గుణం.. అంతకుముందు ఉన్న కమ్యూనిస్టు బ్యాగ్రౌండ్.. ఇవన్నీ తనకు ఉపయోగపడతాయన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published on: Mar 25, 2024 07:59 PM