Sajjala: ఏపీలో నిరుద్యోగ సమస్యపై సజ్జల రియాక్షన్ ఇదే..

టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్య.. ఇచ్చింది కేవలం 34 వేల ఉద్యోగాలే అన్నారు సజ్జల. జగన్ వచ్చాక సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి లక్షా 30 వేల జాబ్స్ ఇచ్చినట్లు తెలిపారు. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 54 వేల ఖాళీలు భర్తీ చేసినట్లు తెలిపారు. ఇది బహిరంగ విషయమే అన్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు. 

Sajjala: ఏపీలో నిరుద్యోగ సమస్యపై సజ్జల రియాక్షన్ ఇదే..

|

Updated on: Mar 25, 2024 | 8:15 PM

ఏపీలో.. ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. అసలు చదువుకున్నవారికి సరైన అవకాశాలు లేవు..? అసలు స్టేట్ ఎటు పోతుందో అర్థం కావడం లేదు.. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్. ఈ ప్రశ్నను సజ్జలకు సంధించారు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్. అయితే ఇదంతా టీడీపీ ప్రొజెక్షన్ అని కొట్టి పారేశారు సజ్జల. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్య.. ఇచ్చింది కేవలం 34 వేల ఉద్యోగాలే అన్నారు. జగన్ వచ్చాక సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి లక్షా 30 వేల జాబ్స్ ఇచ్చినట్లు తెలిపారు. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 54 వేల ఖాళీలు భర్తీ చేసినట్లు తెలిపారు. ఇది బహిరంగ విషయమే అన్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Follow us