CM Revanth Reddy: అసెంబ్లీ లో అదిరే సీన్.. KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి

Updated on: Dec 29, 2025 | 7:40 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాగా, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ను స్వయంగా కలిసి పలకరించారు. ఇరు నేతలు కరచాలనం చేసుకుని, అభివాదం చేసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది రాజకీయ ప్రత్యర్థుల మధ్య అరుదైన, ఆసక్తికర సన్నివేశంగా నిలిచింది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అరుదైన రాజకీయ దృశ్యం ఆవిష్కృతమైంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈరోజు సభకు హాజరయ్యారు. కేసీఆర్ సభలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన వద్దకు వెళ్లి కరచాలనం చేసి, నమస్కరించారు. దీనికి ప్రతిస్పందనగా, ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా తన స్థానం నుండి లేచి నిలబడి ముఖ్యమంత్రికి అభివాదం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

న్యూయార్క్, న్యూజెర్సీలో మంచు తుఫాన్ తీవ్రత

బీ అలర్ట్‌.. వచ్చే రెండు రోజులూ వణుకే.. మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు

గ్యాంగ్ స్టర్‌ నామినేషన్‌.. కట్టేసిన చేతులు ముఖానికి నల్లటి గుడ్డతో

చలి ఎఫెక్ట్.. చుక్కల్లో కూరగాయల ధరలు ఇప్పటికే కేజీ ధర సెంచరీ క్రాస్‌

వైభవంగా ముగిసిన మండల పూజ.. శరణుఘోషతో ప్రతిధ్వనించిన శబరిగిరులు

Published on: Dec 29, 2025 07:23 PM