పంతం నెగ్గించుకున్న బాలకృష్ణ.. ఏం చేశారంటే? వీడియో

పంతం నెగ్గించుకున్న బాలకృష్ణ.. ఏం చేశారంటే? వీడియో

Samatha J

|

Updated on: Feb 03, 2025 | 8:54 PM

హిందూపురం మున్సిపల్ చైర్మన్‌ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రమేష్‌ ఎన్నికయ్యారు. రమేష్‌కు అనుకూలంగా 23 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి. రమేష్‌ను హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చైర్మన్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు.

పార్టీ మారిన కౌన్సిలర్లకు కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే.. దానికి పోటీగా జై బాలయ్య అంటూ టీడీపీ కౌన్సిలర్ల నినాదాలు చేశారు. హిందూపుర్‌ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక మొదటి నుంచీ ఉత్కంఠ రేపింది. టీడీపీ నుంచి రమేష్, వైసీపీ నుంచి లక్ష్మి పోటీలో ఉన్నారు. చివరకు రమేష్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ.. తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బాయికాట్ చేశారు. ఎన్నిక జరుగుతున్న సమయంలో పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా వైసీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు.