Rajiv Assassination Witness Philip: రాజీవ్‌ హత్యకేసు ప్రత్యక్షసాక్షి ఫిలిప్‌.. నాటి అనుభవం పుస్తకంగా తెస్తా..!(వీడియో)

|

Oct 07, 2021 | 9:54 PM

1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో ఎల్టీటీఈ మానవబాంబు పేలి భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీతో పాటు మరో 14 మంది దారుణంగా మృత్యువాత పడ్డారు. నాటి ఘోరకలి నుంచి బతికి బయటపడ్డవారిలో ఇప్పటికీ సజీవంగా ఉన్న వ్యక్తి ఐపీఎస్‌ అధికారి ప్రదీప్‌ వి.ఫిలిప్‌.

1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో ఎల్టీటీఈ మానవబాంబు పేలి భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీతో పాటు మరో 14 మంది దారుణంగా మృత్యువాత పడ్డారు. నాటి ఘోరకలి నుంచి బతికి బయటపడ్డవారిలో ఇప్పటికీ సజీవంగా ఉన్న వ్యక్తి ఐపీఎస్‌ అధికారి ప్రదీప్‌ వి.ఫిలిప్‌. గత 30 ఏళ్లుగా అతన్ని వెంటాడిన ఆ భయంకరమైన అనుభవాన్ని ఓ పుస్తకంగా తీసుకొస్తా అని తాజాగా చెన్నైలో డీజీపీగా పదవీ విరమణ పొందిన ఫిలిప్‌ ప్రకటించారు.

1991లో కాంచీపురం ఏఎస్పీగా ఉన్న ఫిలిప్‌ నాటి దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన టోపీ, బ్యాడ్జి కింద పడిపోయాయి. వాటిని సాక్ష్యాలుగా స్వీకరించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ కోర్టు కస్టడీలో పెట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు.. లక్ష రూపాయల పూచీకత్తు మీద సిటీ కోర్టు ఇచ్చిన అనుమతితో తన టోపీ, నామఫలకాన్ని పదవీ విరమణ వేడుక సందర్భంగా సర్వీసులో చివరిరోజైన సెప్టెంబర్‌ 30న ఫిలిప్‌ ధరించారు. రక్తపు మరకలంటిన ఈ రెండింటినీ చూసి ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘ఆ దుర్ఘటన నా దృక్పథాన్ని.. జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆయన అన్నారు.

‘ఈ టోపీ, బ్యాడ్జి.. నా రక్తం, చెమట, కన్నీళ్లకు సాక్ష్యాలు. సర్వీసు మొదట్లో తొలిరోజుల్లోనే ఎదుర్కొన్న భయానక అనుభవానికి నిదర్శనాలు. మరణం అంచులను చూపించిన ఈ దుర్ఘటన తర్వాత.. స్థాయి కోసం, అధికారం కోసం నేను పాకులాడలేదు. ప్రజలకు నేను ఏం చేయగలను అనే ఆలోచించా. పోలీసు అధికారాన్ని మానవతాకోణంలోనే వాడా’ అని గుర్తు చేసుకున్నారు. వృత్తి జీవితంలో ఫిలిప్‌ ప్రవేశపెట్టిన ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ పోలీస్‌’ భావన బహుళ ప్రాచుర్యం పొందింది. ఇప్పటికే 30 పుస్తకాలు రాసిన ఫిలిప్‌ ‘నేనింకా చేయాల్సింది చాలా ఉంది’ అని తెలిపారు. YouTube video player
మరిన్ని చదవండి ఇక్కడ : smart watch saves a person: రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ప్రాణం పోసిన స్మార్ట్ వాచ్..!(వీడియో)

 Amazon offer On One Plus: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ. 3 వేల తగ్గింపులో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు..!(వీడియో)

 CM KCR speech Video: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తే.. ఊరుకోం.. పోరాడతాం.. సీఎం కేసీఆర్..(లైవ్ వీడియో)

 Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి కోలాట నృత్యం.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..