Rahul Gandhi: రాహుల్ గాంధీ పెద్ద ఇన్వెస్టరే.! స్టాక్స్ విలువ ఎన్ని కోట్లో తెలుసా.?

|

Apr 06, 2024 | 9:03 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి తాజాగా నామినేషన్ దాఖలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడే ఆయన 4 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. రాహుల్‌ తన మొత్తం ఆస్తుల విలువ 20.4 కోట్ల రూపాయలుగా పేర్కొనగా.. ఎక్కువ శాతం స్టాక్స్, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసినవే కావడం విశేషం. రాహుల్ గాంధీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల విలువ సుమారు 4.3 కోట్ల రూపాయలుగా ఉంది.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి తాజాగా నామినేషన్ దాఖలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడే ఆయన 4 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. రాహుల్‌ తన మొత్తం ఆస్తుల విలువ 20.4 కోట్ల రూపాయలుగా పేర్కొనగా.. ఎక్కువ శాతం స్టాక్స్, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసినవే కావడం విశేషం. రాహుల్ గాంధీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల విలువ సుమారు 4.3 కోట్ల రూపాయలుగా ఉంది. రాహుల్ గాంధీ మొత్తం 25 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీటిల్లో పిడిలైట్ ఇండస్ట్రీస్ లో రూ. 42 లక్షల విలువైన 1474 షేర్లు ఉన్నాయి. బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్‌లో రూ. 35 లక్షల విలువైన 551 షేర్లు, నెస్లే ఇండియా లో రూ. 35 లక్షల విలువైన 1370 షేర్లు ఉన్నాయి. ఇక ఏషియన్ పెయింట్స్ లో రూ. 35 లక్షల రూపాయల విలువైన 1231 షేర్లున్నాయి.

రాహుల్ గాంధీ పలు మ్యూచువల్ ఫండ్ పథకాల్లోనూ ఇన్వెస్ట్ చేసారు. హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్ రెగ్యులర్-గ్రోత్‌లో 1.23 కోట్ల రూపాయలు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్స్- గ్రోత్‌లో 1.02 కోట్ల రూపాయలు విలువ చేసే డిపాజిట్లు ఉన్నాయి. రాహుల్ గాంధీకి సావరిన్ గోల్డ్ బాండ్లలోనూ ఇన్వెస్ట్‌మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం 220 యూనిట్ల సావరిన్ గోల్డ్ బాండ్లు కూడా ఉన్నాయి. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 15.21 లక్షలుగా ఉంది. దీనిని కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంటుంది. స్థిరాస్తుల్లో ఢిల్లీలోని మెహ్రౌలీలో వ్యవసాయ భూమి ఉన్నాయనీ అంతేకాకుండా 49.7 లక్షల మేర రుణాలు కూడా ఉన్నట్లు ప్రకటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..