Rahul Gandhi: కులగణనపై అభిప్రాయాలు.. ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. వీడియో

|

Nov 05, 2024 | 9:22 PM

రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకోనున్న రాహుల్ గాంధీ.. బోయిన్‌పల్లికి వెళ్లనున్నారు. అనంతరం ఐడియాలజీ సెంటర్‌లో కులగణనపై రాహుల్ గాంధీ అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.

కులగణన ద్వారా దేశంలో ఏ వర్గం ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందని.. తెలంగాణలో చేపట్టనున్న కులగణన ప్రక్రియ దేశానికి రోల్‌ మోడల్‌గా మారుతుందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీని ద్వారా దేశ అభివృద్ధి, రాజకీయ స్థితిగతులు మారతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన కార్యక్రమం నేపథ్యంలో మంగళవారం రాహుల్ గాంధీ హైదరాబాద్ లో పర్యటించారు.

మహారాష్ట్ర పర్యటన అనంతరం.. రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో పర్యటించారు. సాయంత్రం 4:45కు ప్రత్యేక విమానంలో మహారాష్ట్ర నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బోయిన్‌పల్లిలోని ఐడియాలజీ సెంటర్‌లో జరగిన సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన కార్యక్రమంపై ప్రజాసంఘాలు, బీసీ సంఘాల నేతలతో సంప్రదింపులు జరపడంతో పాటు వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు.