Congress Bus Yatra: ములుగు కాంగ్రెస్ బహిరంగ సభ.. హాజరైన రాహుల్, ప్రియాంక.. కీలక ప్రసంగం
Rahul Gandhi, Priyanka Gandhi Bus Yatra:తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఆరు గ్యారెంటీల హామీతో ప్రజల్లోకి వెళ్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ఇవ్వాల్టి నుంచి మూడు రోజులు పర్యటించనున్నారు.
Rahul Gandhi, Priyanka Gandhi Bus Yatra:తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఆరు గ్యారెంటీల హామీతో ప్రజల్లోకి వెళ్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ఇవ్వాల్టి నుంచి మూడు రోజులు పర్యటించనున్నారు. ఈ మూడు రోజులపాటు.. 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ రైతులు, మహిళలు, నిరుద్యోగులు, కార్మికులతో మాట్లాడనున్నారు. అంతేకాకుండా పలు బహిరంగ సభల్లో కూడా ప్రసంగించనున్నారు.
బస్సు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం హెలికాప్టర్ లో రామప్ప ఆలయానికి అన్నాచెల్లెలు బయలుదేరారు. ముందుగా రామప్ప ఆలయానికి చేరుకుని 6 గ్యారంటీలతో శివుడి ముందు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ములుగు, భూపాలపల్లి బస్సుయాత్రలో పాల్గొనున్న రాహుల్, ప్రియాంక, రాత్రి భూపాలపల్లిలోనే బస చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..