Chandrababu Arrest: నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్… మళ్లీ పొడిగిస్తారా?
Chandrababu Naidu Arrest: కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది. హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో రకరకాల పిటిషన్లపై విచారణలు జరుగుతునే ఉన్నాయి. స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనుంది. క్వాష్ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించే ఛాన్స్ ఉంది. వచ్చే వారం భువనేశ్వరి, నారా లోకేష్ జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు.
కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది. హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో రకరకాల పిటిషన్లపై విచారణలు జరుగుతునే ఉన్నాయి. స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనుంది. క్వాష్ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించే ఛాన్స్ ఉంది. వచ్చే వారం భువనేశ్వరి, నారా లోకేష్ జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. నిజం గెలవాలి, భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో పర్యటనలు చేయనున్నారు.
అటు జైల్లో ఉన్న బాబుతో కుటుంబ సభ్యుల ములాఖాత్ జరిగింది. వైసీపీ సర్కారు తీరుపై టీడీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును ఆయన భార్య భునవేశ్వరి, కుమారుడు లోకేష్. కోడలు బ్రహ్మణి ములాకాత్ అయ్యారు. దాదాపు గంట సేపు ములాకాత్ సాగింది. లోకేష్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మరో వైపు చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఆందోళన ఉందని టీడీపీ నేతలు అన్నారు. చంద్రబాబుకు కేసే హెల్త్ టెస్టుల వివరాలు కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరారు.
అటు చంద్రబాబు అరెస్టు, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17Aపై ఆంధ్రప్రదేశి్ గవర్నర్ అబ్జుల్ నజీర్‌ను టీడీపీ నేతలు కలిశారు. 50 పేజీల నివేదికను ఆయనకు అందజేశారు. వాస్తవాలతో నివేదికను కేంద్రానికి పంపించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

