PM Modi – Pawan Kalyan: అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం.. ఒకే వేదికపై మోదీ – పవన్..

|

Nov 07, 2023 | 9:01 AM

తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. అభ్యర్ధుల ఖరారు దాదాపు పూర్తి కావడంతో ఇప్పుడు ప్రచారంపై దృష్టి పెట్టింది. బీజేపీ ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు. ప్రధానితో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ సభలో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. అభ్యర్ధుల ఖరారు దాదాపు పూర్తి కావడంతో ఇప్పుడు ప్రచారంపై దృష్టి పెట్టింది. బీజేపీ ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు. ప్రధానితో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ సభలో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం వెళ్లి బహిరంగ సభకు హాజరవుతారు. సభ ముగిసిన తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు. సభకు లక్ష మందిని తరలించేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ నాయకులు సునీల్ బన్సల్, ఇతర నేతలు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.