Pawan Kalyan: చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

TDP-Janasena coordination committee meeting : ఉమ్మడి కార్యాచరణపై తెలుగుదేశం-జనసేన పార్టీలు కసరత్తు పూర్తిచేశాయి. రాజమండ్రిలో భేటీ అయిన పవన్ కల్యాణ్, నారా లోకేష్ పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. మూడు గంటలపాటు జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశంలో 6 అంశాల అజెండాపై చర్చించారు. ఉమ్మడి కార్యాచరణకు ముందే రెండు పార్టీల్లో అంతర్గత సమావేశాలు జరగగా..

Pawan Kalyan: చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
Pawan Kalyan

Updated on: Oct 23, 2023 | 7:30 PM

TDP-Janasena coordination committee meeting : ఉమ్మడి కార్యాచరణపై తెలుగుదేశం-జనసేన పార్టీలు కసరత్తు పూర్తిచేశాయి. రాజమండ్రిలో భేటీ అయిన పవన్ కల్యాణ్, నారా లోకేష్ పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. మూడు గంటలపాటు జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశంలో 6 అంశాల అజెండాపై చర్చించారు. ఉమ్మడి కార్యాచరణకు ముందే రెండు పార్టీల్లో అంతర్గత సమావేశాలు జరగగా.. ఇప్పటికే అమలవుతున్న రెండు పార్టీల సొంత కార్యాచరణ.. ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. రెండు పార్టీల నుంచి ఈ భేటీకి ఇరుపార్టీల నుంచి 14మంది హాజరయ్యారు. సమావేశం అనంతరం పవన్ కల్యాణ్, నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు.

లోకేష్‌ -పవన్ భేటీ కంటే ముందు రెండు పార్టీల్లో కమిటీలు భేటీ అయ్యాయి. ప్రాథమికంగా చేపట్టాల్సిన కార్యాక్రమాలపై వ్యూహాలు రచించాయి. ఆ కమిటీలో ఉన్నదెవరో ఓసారి చూద్దాం . జనసేన కమిటీకి చైర్మన్‌గా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. సభ్యులుగా పార్టీ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, పాలవలస యశస్వి, బొమ్మిడి నాయకర్‌ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి ఏర్పాటైన కమిటీలో చైర్మన్‌గా అచ్చెన్నాయుడు ఉంటే.. సభ్యులుగా యనమల, పితాని, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య ఉన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..