Nara Lokesh Yuva Galam LIVE: కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర.. 400 రోజులు, 4వేల కి.మీ. సర్వం సిద్ధం..(లైవ్)

|

Feb 01, 2023 | 3:46 PM

నారాలోకేష్ యువగళం పాదయాత్రకు అంతా రెడీ అయ్యింది. షరతులు, పోలీస్‌పర్మిషన్‌తో యాత్ర ప్రారంభం కానుంది. కుప్పంలో యువగళం బహిరంగసభను సక్సెస్‌ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు కసిగా ఉన్నారు.


నారాలోకేష్ యువగళం పాదయాత్రకు అంతా రెడీ అయ్యింది. షరతులు, పోలీస్‌పర్మిషన్‌తో యాత్ర ప్రారంభం కానుంది. కుప్పంలో యువగళం బహిరంగసభను సక్సెస్‌ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు కసిగా ఉన్నారు. అటు కుప్పం పసుపు మయంగా మారింది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, తోరణాలతో సందడి కనిపిస్తోంది. 400 రోజులు, 4వేల కిలో మీటర్లు. ఇది ఏపీలో టిడిపి చేపడుతున్న యువ గళం పాదయాత్ర. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు జిల్లా వరకు చేయనున్న పాదయాత్ర. టిడిపి అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో యువగళం పాదయాత్రకు తొలి అడుగు వేయనుంది. కుప్పంలో భారీ బహిరంగ సభతో లోకేష్ జనం మధ్య ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గళం విప్పనున్నారు. ఇక లోకేష్‌ పాదయాత్ర, బహిరంగ సభకు పర్మిషన్‌పై గత 10 రోజులుగా పెద్దరచ్చనే జరగింది. 2 ప్రొసీడింగ్స్‌లో మొత్తం 29 నిబంధనలు పొందుపరిచిన చిత్తూరుజిల్లా పోలీస్‌యంత్రాంగం లోకేష్ యువగళంకు అనుమతి నిచ్చింది. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో వారంరోజులు పాటు సాగే లోకేష్ పాదయాత్రకు పర్మిషన్ జారీ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 27, 2023 11:32 AM