Mega DSC: ఏపీ మెగా డీఎస్సీ వాయిదా.. కారణం ఏంటంటే.?

|

Nov 09, 2024 | 4:34 PM

రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2024 ప్రకటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం బుధవారం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. మళ్లీ మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. సోమవారం టెట్‌ ఫలితాలను ప్రకటించారు అధికారులు.

ఆంధ్ర ప్రదేశ్ మెగా డీఎస్సీ 2024 ప్రకటన వాయిదా పడింది. మరో రెండ్రోజుల వ్యవధిలో అంటే ఆరో తేదీన డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడుతుందని పాఠశాల విద్యాశాఖ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించింది. కానీ, సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు మెగా డీఎస్సీ వాయిదా పడటానికి ఎస్సీ రిజర్వేషన్లే కారణమని తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయకూడదని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌ చేస్తోంది.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణ పూర్తయ్యే వరకు డీఎస్సీ ప్రకటన ఇవ్వడానికి వీలులేదని MRPS డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఆయన రిజర్వేషన్ల అమలుకు సంబంధించి పలు అంశాలను సీఎంతో చర్చించారు. డీఎస్సీ నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్ల అంశం కొలిక్కిరాకపోవడం, దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.