Jubilee Hills Bypoll Updates: పోలింగ్ బూత్ లకు రాని జూబ్లీహిల్స్ ఓటర్స్.. కారణం ఏంటి..?

Edited By: Phani CH

Updated on: Nov 11, 2025 | 12:53 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం ఆశించిన దానికంటే చాలా తక్కువగా నమోదైంది. సాధారణ ఎన్నికల్లోనూ తక్కువ పోలింగ్ ఉండే ఈ ప్రాంతంలో ఉప ఎన్నికపై ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. విద్యావంతులైన ఓటర్లు సైతం పోలింగ్ కేంద్రాలకు రాకపోవడం గమనార్హం. రాజకీయ పార్టీల ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్ల ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోంది. పోలింగ్ బూత్‌లు ఖాళీగా దర్శనమిచ్చాయి, ఓటింగ్ శాతం కేవలం 9.2% వద్ద నిలిచింది, ఇది ఆశించిన 18% కంటే చాలా తక్కువ.  జూబ్లీహిల్స్‌లో సాధారణ ఎన్నికల సమయంలోనూ పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది, అయితే ఉప ఎన్నిక కావడంతో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, వెంగళ్ రావు నగర్ వంటి ప్రాంతాల్లోని విద్యావంతులైన ఓటర్లు సైతం పోలింగ్ కేంద్రాలకు రాలేదు. ఉచిత ఆటోలు, క్యాబ్‌లు, రాపిడో వెహికిల్స్ ఏర్పాటు చేసినా ఓటర్లు కదలడం లేదని రాజకీయ పార్టీల ఏజెంట్లు పేర్కొన్నారు. పని ఒత్తిడి లేదా ఎన్నిక పట్ల నిరాసక్తత దీనికి కారణం కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jubilee Hills Bypoll: డ్రోన్ కెమెరాలతో జూబ్లీహిల్స్ ఓటింగ్ పర్యవేక్షణ