KTR: కేసీఆర్ ను తిట్టడం తప్ప వాళ్ళు చేసిందేమీ లేదు

Updated on: Dec 29, 2025 | 8:13 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ను దూషించడం, పదవి నిలుపుకోవడానికి ఢిల్లీకి తరచుగా వెళ్లడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ అన్నారు. నిరుద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, డబ్బులు ఢిల్లీకి మాత్రమే వెళ్తున్నాయని ఆరోపించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను విమర్శించడం తప్ప ప్రజల కోసం ఎలాంటి పనులు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి ఢిల్లీకి “మూటలు” మోయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు, రెండు లక్షల ఉద్యోగాలు, వృద్ధులకు పెంచిన పెన్షన్లు, మహిళలకు రెండున్నర వేల రూపాయల ఆర్థిక సహాయం వంటి హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇళ్లలోకి దూరి భయభ్రాంతులకు గురి చేస్తున్న వానరాలు

Thalapathy Vijay: అభిమానుల కోరిక మేరకు స్టేజ్ పై విజయ్ స్టెప్పులు

హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక

Srisailam: శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన

CM Revanth Reddy: అసెంబ్లీ లో అదిరే సీన్.. KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి