‘420 హామీలకు గానూ ఒక్కటి మాత్రమే అమలు’.. కాంగ్రెస్‎ పాలనపై కేటీఆర్ కౌంటర్..

|

May 24, 2024 | 3:22 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. కానీ ఒక్క హామీ అమలుచేసి ఐదు గ్యారంటీలు నెరవేర్చామని సీఎం రేవంత్ చెప్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. కానీ ఒక్క హామీ అమలుచేసి ఐదు గ్యారంటీలు నెరవేర్చామని సీఎం రేవంత్ చెప్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయని అవి కాకుండా మేనిఫెస్టోలో 407 హామీలు ఉన్నాయని గుర్తు చేశారు. మొత్తం 420 హామీలకు గానూ ఒక్క ఫ్రీ బస్సు మాత్రమే అమలు అవుతుందని వివరించారు. సన్న వడ్లకే బోనస్ అంటే ఇది బోగస్ ప్రభుత్వమా నిజమైన ప్రభుత్వమా అని ప్రశ్నించారు కేటీఆర్. ఏదో వస్తుందని ఆశపడితే ఉన్నది కూడా పోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో నాట్లు వేసే సమయంలో రైతుబంధు వస్తే.. ఇప్పుడు ఓట్లు వేసేటప్పుడు మాత్రమే రైతుబంధు వస్తుందని మండిపడ్డారు. తీరా వడ్లకు బోనస్ విషయంలోనూ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on