రైతు బంధు ఆపడానికి కాంగ్రెస్ నాయకులకు సిగ్గు ఉందా – సీఎం కేసీఆర్
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతోమంది రైతు బంధు పొందుతున్నారని.. దాన్ని ఆపడానికి వారికి సిగ్గు, మానం ఏమైనా ఉందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతోమంది రైతు బంధు పొందుతున్నారని.. దాన్ని ఆపడానికి వారికి సిగ్గు, మానం ఏమైనా ఉందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ నేతలు గత నెలలో ఫిర్యాదు చేశారని కేసీఆర్ తెలిపారు. ఇది ఎప్పుడూ జరిగే తంతు అని తాను రిక్వెస్ట్ చేస్తే.. ఈనెల 28న రైతుబంధు ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఒప్పుకుందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మరోసారి ఫిర్యాదు చేయడంతో.. రైతుబంధును కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఆపేసిందని ఆరోపించారు.
రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఓటును వివేకంతో వేయాలని సీఎం కేసీఆర్ ఓటర్లకు సూచించారు. అభ్యర్థులతో పాటు వారి పార్టీల చరిత్ర, దృక్పథం చూడాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు తప్ప.. ఏమీ ఉండలేదన్నారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. షాద్‌నగర్ వరకు మెట్రో రైలు, మెడికల్ కళాశాల నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

