CM KCR LIVE: తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. భారత్ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ మార్పు..

| Edited By: Ravi Kiran

Oct 05, 2022 | 1:26 PM

టిఆర్ఎస్ పార్టీ తీరు ఇప్పటి వరకూ ఒకెత్తు. ఇకపై మరొక ఎత్తు. ఇక నుంచి కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితమై.. ఇక్కడి ఎన్నికలతో సరి పెట్టే పరిస్థితి లేదు. దేశ వ్యాప్తంగా పట్టున్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ తన కార్యకలాపాలను మొదలు పెట్టనుంది.


టిఆర్ఎస్ పార్టీ తీరు ఇప్పటి వరకూ ఒకెత్తు. ఇకపై మరొక ఎత్తు. ఇక నుంచి కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితమై.. ఇక్కడి ఎన్నికలతో సరి పెట్టే పరిస్థితి లేదు. దేశ వ్యాప్తంగా పట్టున్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ తన కార్యకలాపాలను మొదలు పెట్టనుంది. దీంతో గులాబీ కేడర్ లో రానున్న మార్పు చేర్పులేంటి? లాభాలేంటి? నష్టాలేంటి?ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీగా ఉన్న.. టీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి సారించడంతో.. పార్టీ అంతర్గత వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది.ద్యమ పార్టీగా , పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రాష్ట్రంలో 8 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కొత్త పాత్ర పోషించేందుకు సన్నద్ధమైంది. తెలంగాణ భవన్‌లో ప్రారంభమయ్యే పార్టీ జనరల్‌ బాడీ సమావేశానికి కేసీఆర్‌ అధ్యక్షత వహిస్తారు.కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుసహా 283 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Published on: Oct 05, 2022 10:14 AM