కవిత ఎమోషనల్‌గా నిర్ణయం తీసుకున్నారు.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
ఎమ్మెల్సీ స్థానానికి కవిత రాజీనామా చేసి రెండు వారాలు దాటింది.. మరి ఆమోదం ఎప్పుడు? అనే విషయంపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కవిత రాజీనామాపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాజీనామా ఆమోదించాలని ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారని.. ఎమోషనల్‌గా నిర్ణయం తీసుకున్నారు, పునరాలోచన చేసుకోవాలని చెప్పానన్నారు.
ఎమ్మెల్సీ కవిత రాజీనామా అంశంపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కవిత రాజీనామాపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాజీనామా ఆమోదించాలని ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారని.. ఎమోషనల్‌గా నిర్ణయం తీసుకున్నారు, పునరాలోచన చేసుకోవాలని చెప్పానన్నారు. ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాగా.. సెప్టెంబర్ 3వ తేదీన కవిత MLC పదవికి రాజీనామా చేశారు. BRS ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూనే.. MLC సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తర్వాత తన రాజీనామా ఆమోదించాలంటూ చైర్మన్‌ను కోరారు.
ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చే నిధులతో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని.. ఆరోగ్యశ్రీ, CMRF కోసం ఖర్చు చేసే నిధులతో ప్రభుత్వ వైద్య కళాశాల అభివృద్ధికి కేటాయించండి.. గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. నిమ్స్ తరహాలో అన్ని వైద్య కళాశాలను అభివృద్ధి చేయాలని కోరారు. యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇబ్బందులు తగ్గాలంటే ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేయాలన్నారు. విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని.. గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు.
ఇవి కూడా చదవండి
Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..
Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే
Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్‌లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

