తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడింది- నడ్డా

|

Nov 19, 2023 | 4:26 PM

వేలాది మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. చేవెళ్ల నియోజకవర్గంలో ఆయన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఓట్ల కోసం కేసీఆర్‌ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి హిందువులకు అన్యాయం చేశారని ఆరోపించారు.

వేలాది మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. చేవెళ్ల నియోజకవర్గంలో ఆయన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఓట్ల కోసం కేసీఆర్‌ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి హిందువులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ధరణి పేరుతో పేదల భూములు లాక్కున్నారని చెప్పారాయన. ప్రాంతీయ పార్టీల నేతలంతా తమ వారసుల కోసమే పనిచేస్తున్నారని, బీజేపీ మాత్రమే దేశ ప్రజల కోసం పనిచేస్తుందన్నారు నడ్డా.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Published on: Nov 19, 2023 04:25 PM