Warangal Medical College: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్..! రాష్టంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు..(వీడియో)
తెలంగాణ వైద్య విద్యార్థులకు శుభవార్త. రాష్టంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు రాబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం.. ఆదిశగా అడుగులు వేస్తోంది. 2022-23 విద్యా సంవత్సరంలోనే 8 వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ వైద్య విద్యార్థులకు శుభవార్త. రాష్టంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు రాబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం.. ఆదిశగా అడుగులు వేస్తోంది. 2022-23 విద్యా సంవత్సరంలోనే 8 వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా వరంగల్‌లో ప్రతిమ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. హన్మకొండలో 150 సీట్లతో మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వగా.. 2022-23 అకడమిక్ ఇయర్‌లో అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో మెడికల్ కాలేజీ చేస్తున్నట్లు ప్రతిమ గ్రూప్ ఎండీ హరిణి బోయినపల్లి ప్రకటించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు తక్కువ ధరకే మెరుగైన వైద్యం అందించే క్రమంలో సేవలందిస్తోంది ప్రతిమ గ్రూప్. కోవిడ్ కాలంలో ప్రతిమ ఆస్పత్రులు విస్తృత సేవలను అందించాయి. ఎప్పటికపుడు ప్రజలకు మంచి చేయాలన్న దృక్పథంతో పనిచేస్తున్నాయి ప్రతిమ హాస్పిటల్స్. కరీంనగర్ మెడికల్ కాలేజీ ద్వారా వందల మంది డాక్టర్లను ప్రొడ్యూస్ చేసింది ప్రతిమ గ్రూప్. ఇప్పుడు త్వరలోనే హన్మకొండలో అత్యాధునిక హంగులతో మెడికల్ కాలేజీ ఏర్పాటు జరుగుతుందని గ్రూప్ ఎండీ ప్రకటించారు.
ఇదిలావుంటే, రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మంచిర్యాల, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, జగిత్యాల, రామగుండం, వనపర్తిలో వచ్చే ఏడాదే కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం అవుతాయి. ప్రతీ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున 1200 సీట్లు 2022-23 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. ఇవి కాకుండా మరో 8 వైద్య కళాశాలల ద్వారా 2023-24 విద్యా సంవత్సరంలో మరో 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ : Lion and Tortoise video: నీళ్లు తాగడానికి వచ్చిన సింహం.. చుక్కలు చూపించిన తాబేలు..!(వీడియో)
Fake police Video: గుంటూరులో నకిలీ పోలీస్ హల్‌చల్.. ఖాకీలకే షాకిచ్చిన కానిస్టేబుల్..!(వీడియో)