Ambati Rayudu – CM YS Jagan: సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమవుతున్న అంబటి రాయుడు.. జగన్ తో భేటీ..

|

Jun 08, 2023 | 7:08 PM

రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటికే ప్రకటించిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఆ దిశగా తన ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. గత నెల 11న సీఎం జగన్‌ను కలిసిన అంబటి రాయుడు తాజాగా మరోసారి సీఎంతో భేటీ అవ్వడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాయుడు.. జగన్ ను కలిసేందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి గురువారం మధ్యాహ్నం చేరుకున్నారు.

రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటికే ప్రకటించిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఆ దిశగా తన ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. గత నెల 11న సీఎం జగన్‌ను కలిసిన అంబటి రాయుడు తాజాగా మరోసారి సీఎంతో భేటీ అవ్వడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాయుడు.. జగన్ ను కలిసేందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి గురువారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఇద్దరి మధ్య దాదాపు అరగంటపాటు చర్చలు జరిగాయి. జగన్ తో భేటీ అనంతరం అంబటి రాయుడు అక్కడి నుంచి ఇంటికి బయలు దేరారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన అంబటి రాయుడు వైసీపీలో చేరి.. అక్కడి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్‌ను వెంటవెంటనే కలుస్తుండటం ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది. అయితే, అంబటి రాయుడు గుంటూరు ఎంపీ లేదా పొన్నూరు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.